Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

12 Oct, 2022 17:39 IST|Sakshi

1. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్‌ శాఖ అధికారులు వివరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అంతర్గత రహస్యాలున్నాయ్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితోపైకి వచ్చాడని.. ఎవరి మీద ఆధారపడ లేదని.. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఆయన అభివృద్ధిలో ఎవరి పాత్ర లేదన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడులో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్‌
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో​ పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అధికార టీఆర్‌ఎస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్‌ ప్రకటించిన కేంద్రం
కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. శ‌శి థ‌రూర్‌తో పోలిక‌.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు!
కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్‌ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ అదృశ్యం.. రష్యా పనే!
జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ వలెరియ్‌ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది.  ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు
రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు జియో సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్ పై దృష్టి పెట్టింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!
బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్‌ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. జూనియర్‌ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. యంగ్‌ హీరో అరెస్ట్‌!
వర్ధమాన నటుడు ప్రియాంత్‌ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ మహిళా జూనియర్‌  ఆర్టిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో  పేర్కొంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. థైరాయిడ్‌ ఉన్న వారికి, అబార్షన్స్‌ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్‌ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్‌ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు