Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

12 Nov, 2022 17:50 IST|Sakshi

1. సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్‌
దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్‌ 177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదయింది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?!
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ రావడం, పవన్‌ కళ్యాణ్‌ను కలవడం.. ఇది ఎల్లో మీడియాకు మహాదానందం కలిగించిందన్నది వారి పత్రికల్లో అచ్చేసిన రాతలను బట్టి సగటు ఆంధ్రులందరికీ అవగాహన కలిగిన విషయం. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు, కానీ..: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హిమాచల్‌లో పోలింగ్‌.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రమంతా పోలింగ్‌ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్‌ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఎట్టకేలకు పుతిన్‌ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్‌ జోష్‌లో ఉక్రేనియన్లు
ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత  కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే,
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు!
ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్‌ త్రైమాసికంలో యూరోపియన్‌ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్‌ కమిషన్‌ వెల్లడించింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్‌ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. జనసేన నాయకుల ఓవరాక్షన్‌.. దెబ్బకు జారుకున్నారు
కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు