Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

17 Oct, 2022 18:02 IST|Sakshi

1. వైఎస్సార్‌ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల  ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల సాయాన్ని అందించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్‌ కామెంట్స్‌
పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్‌ గ్యాప్‌లో పవన్‌ విశాఖకు వెళ్లారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’
రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్‌ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. టీఆర్‌ఎస్‌ ఎంపీకి ఈడీ మరో షాక్‌..
రుణాల పేరిట మోసం చేసిన కేసులో టీఆర్‌ఎస్‌ ఎంపీ  నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ  జప్తు చేసింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని మధుకాన్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ అటాచ్‌ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు.. 600 మంది మృతి.. 2 లక్షల ఇళ్లు ధ్వంసం
దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్‌’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అమానవీయం.. అప్పు చెల్లించలేదని స్కూటర్‌కు కట్టేసి.. నడిరోడ్డుపై..
ఒడిశా కటక్‌ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. రూపాయి పతనం: ఆమెకు నోబెల్‌ ఇవ్వాల్సిందే! సోషల్‌ మీడియా కౌంటర్లు
దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు  ఇంటర్నెట్‌లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్‌ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది?
టీ20 ప్రపంచకప్‌-2021లో కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి  ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్‌ సేన.. టైటిల్‌ విజేతగా నిలవాలని భావిస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్‌ టెన్‌లో బాలీవుడ్ నటి..!
బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన  ఉనికి చాటుకుంది.  తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు