Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

15 Oct, 2022 17:43 IST|Sakshi

1. జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’
విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్‌లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీకి భారీ వర్ష సూచన.. రానున్న మూడు రోజులపాటు..
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన  ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి విస్తరించి ఉందని పేర్కొంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘రాహుల్‌ ఓ ఫెయిల్డ్‌ మిసైల్‌.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’
కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ, భారత్‌ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై. రాహుల్‌ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్‌.. విడుదలపై స్టే
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్‌ సాయిబాబాకు భారీ షాక్‌ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పాకిస్తాన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్‌ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్‌ లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ రిసెప్షన్‌ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌కు షాక్‌.. గులాబీ గూటికి పల్లె రవికుమార్‌ దంపతులు
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్‌, ఆయన సతీమణి శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్‌’
క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది.  ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్‌ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. రెండుసార్లు చూశా.. థ్రిల్లింగ్‌ క్లైమాక్స్‌..కాంతారాపై ప్రభాస్‌ రివ్యూ
కన్నడ హీరో రిషబ్‌ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

9. ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్‌ విజేతగా భారత్‌
మహిళల ఆసియాకప్‌-2022 విజేతగా భారత్‌ నిలిచింది. షెల్లాట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం..
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్‌ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు