టీఆర్ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే: మధుయాష్కీ

9 Feb, 2022 21:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఒకే రకమైన ఆలోచనలతో కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ దుయ్యబట్టారు. బయటకు మాత్రం శత్రువుల్లా.. కనిపిస్తూ.. లోలోపల కలిసి ఒకరి కోసం ఒకరంటూ పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

‘‘ఈ రెండు పార్టీల నాకుడు.. జోకుడు వ్యవహారం వల్లే తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఏవీ రాలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద.. విభజిత రాష్ట్రాలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి.. డైవర్షన్ స్కీమ్ లెక్కన కొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చింది.. రెండు రాష్ట్రాలకు సమానంగా చెందాల్సిన అన్ని అంశాలకు సబంధించి.. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థపైనా చట్టం రూపొందించింది.. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న మీరు వాటిపై ఏంజేశారో చెప్పుకోలేక.. చెప్పుకోనికి ఏమీలేక.. మీడియా హైప్ కోసం కోట్లాడుతున్నట్లు డ్రామాల్జేస్తున్నారు. నిజంగా తెలంగాణ మీద మోదీ-కేసీఆర్ లకు చిత్తశుద్ది ఉంటే.. వెంటనే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని మధుయాష్కీ గౌడ్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు