ఈ వారంలో మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు కీలక శాఖ?

8 Aug, 2022 07:39 IST|Sakshi

న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఈ వారంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఆగస్టు 15లోగా కేబినెట్‌ విస్తరణకు సీఎం షిండే సన్నాహాలు చేస్తున్నారు.

జూన్‌ 30న ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పదవీ ప్రమాణం చేశారు. అప్పట్నుంచి వారిద్దరితోనే కేబినెట్‌ నడుస్తూ ఉండడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శల్ని ఫడ్నవీస్‌ కొట్టిపారేశారు. ఎన్‌సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ వారి ప్రభు త్వంలో మొదటి 32 రోజులు కేవలం అయిదుగురే ఉన్న విషయాన్ని అజిత్‌ దాదా మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా మహారాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరగనుంది.
చదవండి: ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు