ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు..

28 Jun, 2022 14:36 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్‌ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే భేటీ అయ్యే అవకాశముంది. అయితే రెబెల్స్‌తో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. అదే విధంగా సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మంగళవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఏదేమైనా నేడు ఢిల్లీలో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.

కాగా మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలకు ఏక్‌నాథ్‌ షిండే కౌంటర్‌ ఇచ్చారు. గౌహతి క్యాంప్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. తనతోపాటు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఉద్దవ్‌ ఠాక్రేతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్‌ విసిరారు.
చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘డబుల్‌’ ట్విస్ట్‌

ప్రభుత్వం చేసిన తప్పేంటి?
అంతకముందు శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలపై ఆదిత్య ఠాక్రే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వేళ అసెంబ్లీలో అవిశాస్వ  తీర్మాణం జరిగితే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బల పరీక్షకంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. వాళ్లు రెబెల్స్‌ కాదని, ద్రోహులని అన్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయొచ్చని, ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరన్నారు.

మరిన్ని వార్తలు