Maharashtra Political Crisis: హాట్‌ టాపిక్‌గా మారిన నెంబర్‌ గేమ్‌!

23 Jun, 2022 16:26 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర సస్పెన్స్‌ అంతకంతకూ పెరిగిపోతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కఠ రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో నంబర్‌ గేమ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు ఉద్దవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే‌కు మద్దతిస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరగుతుంది. తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.  
సంబంధిత వార్త: Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన

శివసేన, బీజేపీతో చేతులు కలపాలి: షిండే
మరోవైపు గౌహతిలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రదర్మన నిర్వహించారు. రాడిసన్‌ హోట్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఓకే వేదికపై వచ్చారు.  మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో షిండే వీడియో విడుదల చేశారు. సీఎం పీఠం నుంచి ఉద్దవ్‌ ఠాక్రే దిగిపోవడం తమకు ముఖ్యం కాదని ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఇదిలా ఉండగా గౌహతిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 
చదవండి: సీఎం థాక్రేకు రెబల్‌ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు

శివసేన బలంగా ఉంది: సంజయ్‌ రౌత్‌
అయితే గౌహతి గ్రూప్‌లో 22 మంది ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. వారంతా ముంబైకు తిరిగి వస్తున్నట్లు తమకు చెప్పినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మాణం జరిగితే కచ్చితంగా గెలుస్తామన్నారు. థాక్రే మళ్లీ అధికారిక నివాసం వర్షకు వస్తారని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నా శివసేన బలంగా ఉందన్నారు. కొంతమంది ఈడీ భయంతో పార్టీ మారరన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు షిండేతో ఎందుకు వెళ్లారో, పార్టీలో ఎందుకు తిరుగుబాటు ఎందుకు వచ్చిందో తరువాత తెలుస్తుందన్నారు. ఫ్లోర్‌ టెస్ట్‌ జరిగినప్పుడు ఎవరి బలమెంటో తెలుస్తుందన్నారు.

బీజేపీ పోస్టర్లు
అటు దేవేంద్ర ఫడ్నవీస్‌కు అనుకూలంగా మహారాష్ట్రలో పోర్టు పోస్టర్లు వెలిశాయి. ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాడంటూ బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు