‘మహా’ సంకటం: అనర్హత వేటు గండం.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ

23 Jun, 2022 10:17 IST|Sakshi

ముంబై: శివ సేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే వైఖరితో.. మహారాష్ట్ర రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పార్టీని వీడమని, సొంత కుంపటి ఊసే ఉండదంటూ.. ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి నుంచి బయటకు వచ్చేయాలంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేకు అల్టిమేట్‌ జారీ చేశాడు షిండే. ఈ తరుణంలో సీఎం పదవికి రాజీనామా చేయకుండానే.. కుటుంబంతో పాటు సీఎం అధికార భవనాన్ని వీడాడు సీఎం థాక్రే. అయితే..

షిండే వర్గం ముందర ఇప్పుడు మరో గండం పొంచి ఉంది. అసెంబ్లీలో శివ సేన 55 సీట్లతో అడుగుపెట్టింది. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఇప్పుడు షిండే వర్గంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అది తప్పించుకోవాలంటే.. తన బలం 37గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది షిండేకి. 

బుధవారం శివ సేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే‌.. మహారాష్ట్ర గవర్నర్‌కు పంపిన లేఖలో 34 మంది మద్దతు ఎమ్మెల్యేల(షిండేతో సహా) సంతకం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో నలుగురు శివ సేన ఎమ్మెల్యేలు కాదు. శివ సేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్.. తిరిగి నిన్న సాయంత్రం నాటకీయ పరిణామాల నడుమ థాక్రే గూటికి చేరుకున్నారు. ఈ తరుణంలో.. 

గురువారం ఉదయం మరో నలుగురు రెబల్స్‌ గ్రూపుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలతో  షిండే వర్గం అనర్హత గండం గట్టెక్కుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.

మరిన్ని వార్తలు