Devendra Fadnavis: మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్‌ పేరిట ఓ రికార్డు

1 Jul, 2022 18:01 IST|Sakshi

ముంబై: ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు అనంతర కాలంలో మంత్రి పదవులు చేపట్టడం రావడం అరుదనే చెప్పాలి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరిట ఇలాంటి రికార్డు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, అనంతరం అంతకంటే తక్కువ పదవులతోనే సరిపెట్టుకున్న నాలుగో మాజీ సీఎం అయ్యారు ఫడ్నవీస్‌.

2014–19 సంవత్సరాల్లో బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేనతో విభేదాలు తలెత్తాయి. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల అండతో సీఎం పదవిని చేపట్టినా పొత్తు పొసగక మూడు రోజుల్లోనే సీటు దిగిపోయారు. మహారాష్ట్ర సీఎంగా 1975లో కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు చవాన్‌ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల అనంతరం వసంతదా పాటిల్‌ సీఎం అయ్యారు. 1978లో శరద్‌ పవార్‌ ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి సీఎం అయ్యారు.
చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్‌ వార్నింగ్‌

పవార్‌ కేబినెట్‌లో చవాన్‌ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1985–86 సంవత్సరాల్లో శివాజీరావు పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం, 2004లో సుశీల్‌ కుమార్‌ షిండే కేబినెట్‌లో ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. శివసేనకు చెందిన నారాయణ రాణే 1999లో మహారాష్ట్ర సీఎం అయి తక్కువ కాలంలోనే వైదొలిగారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.  
చదవండి👉🏻కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్‌ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన

మరిన్ని వార్తలు