రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ!

15 Jun, 2022 14:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెర మీదకు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు వినిపిస్తోంది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్‌కృష్ణ గాంధీ.. పోటీలో నిలపాలనే ప్రతిపాదనను వామపక్ష పార్టీలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఐఏఎస్‌, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్‌కృష్ణ గాంధీ.. గతంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా  కూడా పని చేశారు.  2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్‌ గాంధీ పోటీ చేశారు కూడా. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు.

ఇదిలా ఉంటే.. బుధవారం జరగబోయే విపక్షాల భేటీతో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించబోయే ఈ భేటీకి దూరం జరిగాయి నాలుగు పార్టీలు. టీఆర్‌ఎస్‌, ఆప్‌, బీజేడీ, అకాలీదళ్‌ గైర్హాజరు కానున్నాయి. భేటీలో కాంగ్రెస్‌ ఉన్నందునా తాము భేటీకి దూరంగా ఉంటామని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రకటించింది.

చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు సీనియర్‌ నేత షాక్‌

మరిన్ని వార్తలు