చంద్రబాబు, లోకేష్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

19 Aug, 2021 11:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిపెట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని చెప్పారు. గురువారం గిరిపురం 24వ డివిజన్లలో గుడ్‌ మార్నింగ్‌ విజయవాడ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  చంద్రబాబు, లోకేష్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతల్లో మార్పురావాలని, సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు