బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు

5 Sep, 2021 16:36 IST|Sakshi

సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అడ్డూఅదుపు లేదు

బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లాది విష్ణు

సాక్షి, తాడేపల్లి: పండుగల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేయడం తగదని బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విష్ణు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోవిడ్‌ నేపథ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని  కేంద్రమే తెలిపిందని, మరి అటువంటప్పుడు దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.

కరోనాతోనే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవం వాయిదా వేశామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించ లేదని చెప్పారు. ప్రజల మేలు కోసమే పండుగల ఇళ్లలో చేసుకోవాలని సూచించామని స్పష్టం చేశారు. అన్ని పండుగలకు పోలీసులు ప్రజలు గుమికూడకుండా చూస్తున్నారని వివరించారు. వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడరని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు.


చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక 

మరిన్ని వార్తలు