‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమే’

7 Aug, 2022 20:55 IST|Sakshi

ఖమ్మం జిల్లా: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో కంటే అత్యధిక మెజారిటీని ఈసారి మునుగోడులో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఇక్కడ కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని పేర్కొన్న భట్టి.. పార్టీని వీక్‌ చేయడం కోసం సోషల్‌ మీడియాలో గోబెల్స్‌ ప్రచారం జరుగుతుందన్నారు.

ఇదంతా కుట్రలో భాగమేనని భట్టి అన్నారు. ఆ కుట్రలో ఎవ్వరూ పడొద్దని పిలుపుచ్చారు. ఊహాజనితమైన ప్రశ్నలు కరెక్ట్‌ కాదని అన్నారు.  వామపక్షాలను కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని అడుగుతున్నానని భట్టి ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు