‘ఒంటెద్దు పోకడ విడనాడాలి’

14 Sep, 2020 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పెద్ద ఎత్తున అప్పులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని గన్‌పార్క్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుకుంటున్నారు. దీనివల్ల రెవెన్యూ రిసిప్ట్స్ కి లక్షా 10వేల కోట్లు గ్యారెంటీ పెట్టారు. ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపి 2020 నాటికి 5,87,536 కోట్లు అవుతుంది. ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నాం.  భవిషత్తులో రాష్ట్ర ప్రజల నెత్తిపై భారం పడుతుందన్న భట్టి ప్రభుత్వ విధానాలపై పోరాడతాం’ అని పేర్కొన్నారు.  (మాన్యువల్‌ రికార్డులూ నిర్వహించాలి)

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే భూములకు సంబంధించి సర్వేలు జరుగుతున్నాయని, భూ సర్వే చేసిన తర్వాతే ధరణిలో నమోదు చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఏపక్షంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారని, కేవలం సంఖ్యా బలంతో బిల్లులు పాస్ చేస్తున్నారన్నారు. ఈ మూడేళ్ళలో సర్వే చేయకుండా కేసీఆర్ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పి పుచుకునే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేని ప్రభుత్వం ఒంటెద్దు పోకడ విడనాడాలని హితవు పలికారు. (కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ)

ల్యాండ్ రికార్డ్ మోనటరైజేషన్‌కు యూపీఏ, ఎన్డీఏ హయాంలో నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదుని, గతంలో కేసీఆర్ వీఆర్వో, ఎమ్మార్వోలకు బాగా పని చేస్తున్నారని బోనస్ ఇచ్చారని గుర్తు చేశారు. 77 వేల ఎకరాల్లో 54 వేల ఎకరాలు కబ్జాకు గురైందని కేసీఆర్ చెప్పారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను పతిష్టం చేసి అభివృద్ధి చేయాలని, నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు డిమాండ్‌ చేశారు. 2014 నుండి చెప్తున్నా వీసీల నియామకం చేయలేదని అన్నారు. అనుమతి ఇచ్చిన 5 ప్రయివేట్ యూనివర్సిటీల్లో మూడు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తులవేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు