రేవంత్‌ను విమర్శిస్తే ఊరుకోం 

20 Dec, 2022 04:13 IST|Sakshi

రాజగోపాల్‌రెడ్డికి మల్లు రవి హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ భిక్షతో రాజ కీయంగా ఎదిగి, డబ్బుల కోసం పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని బ్లాక్‌మెయిలర్‌ అని కోమటిరెడ్డి మాట్లాడితే కాంగ్రెస్‌ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, నాలుక చీరేస్తారని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ దయాదాక్షిణ్యాలతో ఎంపీగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించి, కాంగ్రెస్‌ హయాంలో కాంట్రాక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూడటం నీచమైన చర్య అని విమర్శించారు. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు