మమతా ఢిల్లీ పర్యటన.. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండా

26 Jul, 2021 12:45 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు తృణమూళ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ, యంఎస్‌ బెనర్జీలు హస్తినాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్‌ అధినేత్రి, సోనియా గాంధీ, శరద్‌ పవార్‌ సహ విపక్ష నేతలందరిని కలువనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఏకీకరణ దిశగా మమతా బెనర్జీ పర్యటన సాగుతుందని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా, ఈనెల 28న పత్రిపక్ష పార్టీలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అపాయింట్‌మెంట్‌ మమతా.. ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీని తృణముల్‌ కాం‍గ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సారథిగా ఏకగ్రవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. 

మమతా ఇప్పటి వరకు 7 సార్లు ఎంపీగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని మమతా బెనర్జీ విమర్షిస్తున్నారు. మమతా ఢిల్లీ పర్యటన గురించి టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ.. బీజేపీ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో 2024 విపక్షల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి రేసులో మమతా ముందు వరసలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారని తెలిపారు. ఇక దీదీ ఢిల్లీ పర్యటన ప్రకటనతో హస్తిన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని వార్తలు