అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులు కావు: మమత

26 Aug, 2021 10:41 IST|Sakshi

కోల్‌కతా: ప్రదాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) పాలసీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశానికి చెందిన ఆస్తులను అమ్మడాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని, విభ్రాంతిని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆయా ఆస్తులు ప్రధాని మోదీ, బీజేపీలకు చెందినవి కాదని విమర్శించారు. దేశ ఆస్తులను వారికి నచ్చినట్లుగా అమ్ముకోలేరని దుయ్యబట్టారు.

చదవండి: నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె

మరిన్ని వార్తలు