అక్టోబరు 7న ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ప్రమాణం

5 Oct, 2021 15:51 IST|Sakshi

కోల్‌కతా: భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు లేఖ రాశారు. 

అక్టోబరు 3న విడుదలైన  భవానీపూర్‌, జంగీపూర్‌, షంషేగంజ్‌ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.  ఎన్నికల కమిషన్‌ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్‌కు 26,428 ఓట్లు సాధించింది. ఉత్తర ప్రదేశ్‌ లఖీంపూర్‌ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది. విపక్షనేతలు.. రైతులను పరామర్శించకుండా అడ్డుకోవడంపై ఛటర్జీ మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్‌ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చదవండి: Bhabanipur Bypoll: భవానీపూర్‌ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం

మరిన్ని వార్తలు