‘2023 నాటికి కేసీఆర్‌ దొరల పాలన అంతం’

13 Aug, 2020 13:08 IST|Sakshi
మంద కృష్ణమాదిగ

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: సీఎం కేసీఆర్‌ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే కేసీఆర్‌‌ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాశానని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా కేసీఆర్ ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు భూపంపిణీ ఎందుకు జరగలేదని మండిపడ్డారు. (కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?)

మరిన్ని వార్తలు