ఆయన నాకు మంచి మిత్రుడు.. ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టాడు: ఠాగూర్‌

17 Aug, 2022 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఠాగూర్‌ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని తెలియజేశారు. ఈ మేరకు ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌ మాత్రమే.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టాడు. బీజేపీలో చేరిన వాళ్లే నాపై ఏదైనా మాట్లాడతారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల్ని సోనియా, రాహుల్‌​, ప్రియాంక తెలుసుకుంటున్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణకి వస్తా అంటే వెల్కమ్‌ చెప్తాను. ఇక్కడ నుంచి పోటీచేయాలని రాహుల్‌, ప్రియాంకను రిక్వెస్ట్‌ చేస్తే వాళ్లు ఆలోచిస్తారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనని మాణిక్యం ఠాగూర్‌ పేర్కొన్నారు.

చదవండి: (కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. రేవంత్‌ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్‌ రెడ్డి)

మరిన్ని వార్తలు