పటాన్‌చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!

17 Aug, 2023 17:33 IST|Sakshi

నియోజకవర్గం : పటాన్‌ చెరు

మండలాలు : 5 (పటాన్‌ చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్‌, జిన్నారం, గుమ్మడిదాల)

అతి పెద్ద మండలం : పటాన్‌ చేరు

మొత్తం ఓటర్లు : 323332

పురుషులు : 170061; మహిళలు : 158649; ఇతరులు : 26

ఉమ్మడి  మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్‌చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. 

మూడు పార్టీ‍ల్లోనూ వర్గపోరు!

మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్‌చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్‌లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్‌ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.  

ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్‌ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. 

నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు :

  • 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం
  • వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం.

రాజకీయానికి అంశాలు :
పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె  కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు.

ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు :
పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి.

ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : 

బీఆర్ఎస్ :

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కాంగ్రెస్ :

  • కాట శ్రీనివాస్ గౌడ్, 
  • గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్)

బిజెపి:

  • మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్
  • మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్
  • అమీన్‌పూర్‌ కౌన్సిలర్ ఎడ్ల రమేష్
  •  పారిశ్రామికవేత్త అంజిరెడ్డి.
మరిన్ని వార్తలు