ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ

29 Mar, 2021 15:04 IST|Sakshi

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి షాక్‌

పాస్‌పోర్టు జారీకి నిరాకరణ

ఆర్టికల్‌ 370  రద్దు తరువాత   రాష్ట్రంలో  ఇదీ దుస్థితి: మెహ‌బూబా ముఫ్తీ

పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భ‌ద్ర‌త‌కు  ముప్పెలా అవుతుంది. 

సాక్షి, కశ్మీర్‌ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి , జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎదరు దెబ్బ తగిలింది.  దేశ భద్రతకుముప్పు అంటూ ముప్తీ  పాస్‌పోర్టును రద్దు చేసింది. ఈ మేరకు  సోమవారం ఉదయం ముఫ్తీ ట్విట్‌ చేశారు.  2019 ఆగస్టు (స్పెషల్‌ స్టేటస్‌ రద్దు)తరువాత రాష్ట్రంలో నెలకొన్న సాధారణ పరిస్థితికి ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి పాస్‌పోర్ట్  ఇవ్వడం ఇంత పెద్ద దేశ సార్వ‌భౌమ‌త్వానికి ముప్పు  ఎలా  అవుతుందంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు. (మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ)

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌  ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కార్యాలయం  తనకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.  కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు. తన పాస్‌పోర్ట్ గతేడాది మే 31 తో ముగిసిందని, తదనుగుణంగా 2020 డిసెంబర్ 11 న  తాజా పాస్‌పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు.  అయితే దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు అంటూ త‌న పాస్‌పోర్ట్ త‌న‌కు ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రిస్తోంద‌ని  సీఈడీ నివేదిక  ఆధారంగా పాస్‌పోర్టు జారీకి నిరాకరించిందని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనీలాండరింగ్‌ కేసు ఆరోపణల నేపథ్యంలో ముఫ్తీని ఈడీ విచారిస్తోంది. జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్‌సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది.జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేస నమోదు చేసింది. కాగా జమ్ము క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370  ర‌ద్దు అనతరం, మెహ‌బూబాతోపాటు ఇత‌ర నేత‌ల‌ను  కేంద్రం దాదాపు సంవత్సరంపాటు నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు