ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం

11 Jul, 2022 12:18 IST|Sakshi

సాక్షి,అమరావతి: ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్‌ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు.
చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!

కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో  మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు.

మరిన్ని వార్తలు