'మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే'

13 Aug, 2020 13:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తాడేపల్లిలో సుచరిత   గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరిందన్నారు.

హోం మంత్రి మాట్లాడుతూ..' అమూల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు. వైఎస్సార్ చేయూత పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదు.మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్‌ మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి  గౌరవ ప్రదంగా భావిస్తున్నాము.' అంటూ తెలిపారు. (చంద్రబాబు రహస్య ఎజెండాను హర్షకుమార్‌..)

మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడం కోసం సీఎం వైఎస్‌ జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళకు సున్నా వడ్డీ పథకం అమలు చేశారు.డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అమ్మఒడి, చేయుత ద్వారా  మహిళకు ఎంతో మేలు జరుగుతుంది.మహిళ పక్షపాతిగా సీఎం జగన్.. నామినేషన్ పదవులు పనుల్లో 50 శాతం మహిళలకు కల్పించారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మహిళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఉనికి కోల్పోతామే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.టీడీపీ మహిళకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది. దళితుల పై దాడి జరిగిన వెంటనే మా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. కానీ టీడీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది' అంటూ సుచరిత విమర్శించారు.    

మరిన్ని వార్తలు