Adimulapu Suresh: ‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’

27 May, 2022 19:12 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, విశాఖపట్నం: మహానాడులో చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శించేందుకు ఏమీ లేక చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ’టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడిని మించిన దొంగలెవరున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నాడు’’ అని మంత్రి సురేష్‌ ఎద్దేవా చేశారు.
చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’ 

మరిన్ని వార్తలు