ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు: మంత్రి సురేష్‌

25 Jan, 2023 12:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు మా ప్రభుత్వంలోనే అధిక లబ్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు హయాంలో కంటే 45 శాతం అధికంగా ఎస్సీలకు ఖర్చు అధికంగా ఎస్సీలకు ఖర్చు చేశాం. సమాజంలోని అసమానతలు తొలగించేలా ప్రభుత్వం పని చేస్తోంది. మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లు ఖర్చు చేశాం. దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నాం. చంద్రబాబు డైరెక్షన్‌లోనే సబ్‌ప్లాన్‌పై పవన్‌ మీటింగ్‌ జరిగింది. పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే నేను చెప్తాను’’ అని ఆదిమూలపు అన్నారు.

‘‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాల పరిమితిని పదేళ్లు పొడిగించడం అభినందనీయం. దళిత, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని రంగాల్లో దళితులు రాణించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కొన్ని పత్రికలు టీడీపీకి కొమ్ము కాస్తూ వార్తలు రాస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లబ్ధి పొందాలన్నది వాళ్ల దురాశ. ఈనాడు రాతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. కడుపునిండా కుళ్లు, కుతంత్రాలున్నాయి కాబట్టే రామోజీరావు రాక్షసానందం పొందుతున్నాడు’’ అని మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: తెలంగాణలో బలమెంత?.. పవన్‌ ప్రకటనలు వింటే ఏమనిపిస్తుందంటే.. 

‘‘దళితులుగా పుట్టకూడదని చంద్రబాబు అవమానించాడు. అలాంటి చంద్రబాబు దళితులకు న్యాయం ఎలా చేస్తాడు. అధికారంలో ఉండగా దళితులను అణగదొక్కేశారు. జగన్ సీఎం అయ్యాక దళితులకు న్యాయం జరుగుతుంది. ప్రతీ పథకంలోనూ 25 శాతం నిధులు దళితులకు ఖర్చు చేస్తున్నారు. టీడీపీ హయాంలో దళితులకు ఎన్ని నిధులు ఇచ్చారు. మేము ఎన్ని ఇచ్చామో చర్చకు సిద్ధం దమ్ముంటే రండి’’ అంటూ మంత్రి సురేష్‌ సవాల్‌ విసిరారు.


 

మరిన్ని వార్తలు