ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్‌

31 Oct, 2021 14:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎయిడెడ్‌ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రభుత్వం ఏపని చేసినా అడ్డు తగులుతున్నాయన్నారు. ప్రైవేట్‌ రంగానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. అమ్మ ఒడి అన్ని విద్యాసంస్థలకు వర్తింప చేస్తున్నామన్నారు.

ఆర్థిక ప్రోత్సాహకాలతోనే విద్యారంగ ప్రగతి. విద్యాసంస్థ ఏదైనా సరే నిబంధనల ప్రకారం నడవాలి. ఎయిడెడ్‌ విద్యాసంస్థ ప్రక్షాళనపై శ్వేత పత్రం కూడా ఇస్తాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎయిడెడ్‌ స్కూల్‌ మూతపడదు. ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలని మంత్రి సురేష్‌ హితవు పలికారు.
చదవండి: Dr. G Lakshmisha: పేపర్‌బాయ్‌ టూ ఐఏఎస్‌

మరిన్ని వార్తలు