ఆ రోజు పవన్‌ కల్యాణ్‌ నోరెందుకు మెదపలేదు?

18 Jul, 2022 18:15 IST|Sakshi

మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. సీఎం జగన్‌ ఎమ్మెల్యేలకు మరింత దిశానిర్దేశం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించారన్నారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ఫండ్‌ ఇవ్వబోతున్నారని తెలిపారు. 
చదవండి: AP: చీఫ్ మినిస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లు విడుదల

‘‘చంద్రబాబు అధికారంలో ఉంటే పవన్‌ నోటిపై వేలు వేసుకుంటాడు. తోటి నటి రోజాను ఆ రోజు టీడీపీ అవమానిస్తే నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసిస్తే మాట్లాడలేదని’’ అంబటి దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. టీడీపీ విమర్శలకే పరిమితమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

మరిన్ని వార్తలు