అయ్యన్నపాత్రుడు సప్త వ్యసనపరుడు: అవంతి శ్రీనివాస్‌

17 Sep, 2021 21:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలనే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.(చదవండి: ‘పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా?’

‘‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సప్త వ్యసన పరుడు. సీఎంపై మాట్లాడిన తీరు అమానుషం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీకి ఏకపక్ష విజయం వస్తుందని అందరికీ తెలుసు. వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని భావించి టీడీపీ కుట్రలు చేస్తోంది. అయ్యన్న పాత్రుడిని బేషరతుగా అరెస్ట్‌ చేయాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.
చదవండి:
కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్‌! 

మరిన్ని వార్తలు