సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉంది: మంత్రి బొత్స

3 Mar, 2022 14:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని.. సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘అసెంబ్లీ, పార్లమెంట్‌ ఉన్నదే చట్టాలు చేయడానికి.. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మా ప్రభుత్వం విధానం మూడు రాజధానులు. మేం సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. టీడీపీ తన సామాజిక అభివృద్ధి కోసం ఆలోచిస్తోందని’’ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చదవండి: ‘అమరావతి రైతులని చంద్రబాబే నట్టేట ముంచారు’

మరిన్ని వార్తలు