‘హామీలన్నీ అమలు చేస్తుంటే మీకెందుకు కడుపుమంట’

11 Sep, 2022 18:00 IST|Sakshi

తాడేపల్లి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపుమంట ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబులా సీఎం జగన్‌ ప్రజలను మోసం చేయలేదని, ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేశారని బొత్స తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎంత దోపిడీ జరిగిందో తెలియదా అని నిలదీశారు.  

తమ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. తప్పుడు ప్రచారం అనేది ఎల్లో మీడియాకు అలవాటుగా మారిపోయిందని, దీనిలో భాగంగానే కల్యాణమస్తుపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. ఉన్నవి, లేనివి రాస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అసలు తప్పుడు ప్రచారాలతో ఏం చెప్పాలనుకుంటున్నారని, దీనికి రామోజీరావు, రాధాకృష్టలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందరూ చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా బొత్స తెలిపారు.

మరిన్ని వార్తలు