నీటి పంపకాల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం: మంత్రి బొత్స

30 Jun, 2021 11:49 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిరాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. తాము తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం లేదని, నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. 

చట్ట పరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని మంత్రి బొత్స సత్యనారయణ అ‍న్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే త్వరలోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

చదవండి: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

మరిన్ని వార్తలు