చంద్రబాబు పాత జిమ్మిక్కులు చేస్తున్నారు

13 Apr, 2021 19:56 IST|Sakshi

విశాఖపట్నం: తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత జిమ్మిక్కులు చేస్తున్నారు. మొన్న పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించామని, నిన్న రాళ్ల దాడి జరిగిందని కొత్త డ్రామాకు తెరలేపారు అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిరుపతి ఎన్నికల్లో డిపాజిట్లు రావని చంద్రబాబు ముందే గ్రహించి అందుకే రాళ్ల దాడి డ్రామాకు తెరలేపారు. దీనికి సంబందించిన ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయి. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడాలి.. డ్రామాలు ఎందుకు? చంద్రబాబుకు ధైర్యం ఉంటే తిరుపతిలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి. ప్రజలు తోక కత్తిరించినా చంద్రబాబు భాష మారలేదు. లోకేష్ గురించి అచ్చెన్నాయుడు నిజం మాట్లాడారు, రోజూ మేము మీడియా ముందు మాట్లాడేది నాలుగు గోడల మధ్య చెప్పారు అని అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్‌సీపీకి 85 శాతం ఓట్లు వస్తాయి అని మంత్రి పేర్కొన్నారు. 

చదవండి: చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరలేపారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు