రోజా కన్నీరు పెట్టినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా బాబు: బొత్స

27 Nov, 2021 18:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ‘‘ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తోంది. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది టీడీపీ నేతలే. రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సహించం.. అసెంబ్లీలో భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని బొత్స తెలిపారు. 
(చదవండి: ‘చంద్రబాబు ఏడుపులు.. ఆ విషయం ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారు’)

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేశారు. చంద్రబాబు ఏడుపుపై స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలుసు’’ అన్నారు.
(చదవండి: చంద్రబాబుకు బీపీ.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ అసహనం!)

‘‘టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు. జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోంది. సీఎం జగన్‌ మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు’’ అని తెలిపారు.

చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్‌

మరిన్ని వార్తలు