నైతికత వదిలేసిన చంద్రబాబు

18 Sep, 2023 06:43 IST|Sakshi

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

కాకినాడసిటీ: రాష్ట్రంలో తమకు ప్రజా­దరణ తగ్గిపోయిందని గ్రహించిన చంద్ర­బాబు తన కేడర్‌ను, నాయ­కు­లను నమ్మలేక జనసేనను పక్కన పెట్టుకొని రాజకీయ నైతికతను మొత్తం వదిలేశారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల­కృష్ణ అన్నారు.

కాకినాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ తనను నమ్ముకున్న అనేక వర్గాలను హింసించడానికి తోడ్పడ్డాడని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ది అరాచక పాలన అంటున్నారని, పేదలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ వారి సంక్షేమం కోసం పాటు పడటమే అరాచ­కమా? వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చడం కోసం పని చేయడం అరాచకమా? చెప్పాలని మంత్రి వేణు నిలదీశారు. 

మరిన్ని వార్తలు