Andhra Pradesh: పవన్‌ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా

23 Aug, 2022 15:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఈ మేరకు మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు జగన్‌ని వెన్నుపోటు పొడవాలని నారా, పవన్, నాదెండ్ల మనోహర్‌లు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా జగన్‌ని ఏమీ చేయలేరని అన్నారు.

'చిరంజీవి, జగన్ ఎంత ప్రేమ, ఆప్యాయతతో ఉంటారో నాకు తెలుసు. వైఎస్సార్‌సీపీ నుండి మేము అడుగుతున్నాం. చంద్రబాబు చెబితే తప్ప ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో​ కూడా చెప్పలేవు. అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము లేదు. రాష్ట్ర ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి అండగా నిలిచారు. 40కి పైగా పథకాలని ఆపాలని ఇప్పుడు పవన్‌ కోరుకుంటున్నారంటూ' మంత్రి దాడిశెట్టి రాజా చెప్పుకొచ్చారు.

చదవండి: (డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి)

పవన్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
అయితే పవన్‌ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఆయనే పెద్ద పుడింగి అయితే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఎందుకు కలుస్తాడని ప్రశించారు. పవన్‌ కల్యాణ్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గుతేల్చు
కాపులకు ఆరాధ్య దైవం అయిన వంగవీటి రంగా హత్య కేసుతో టీడీపీకి సంబంధం లేదని పవన్‌ నిరూపించాలని కోరారు. ఆ కేసు గురించి కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. కాపు నేతల్ని, మహిళలను పోలీసులతో కొట్టించినపుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. కాపులకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబుని ముందు ప్రశ్నించాలని' పవన్‌ కల్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. 

మరిన్ని వార్తలు