మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్‌ సింగిల్‌గానే: దాడిశెట్టి రాజా

8 May, 2022 19:41 IST|Sakshi

సాక్షి, కాకినాడ: చంద్రబాబుతో కలిసిపోవడానికి జనసేన అధినేత తహతహలాడుతున్నాడంటూ పవన్‌ కల్యాణ్‌పై రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌ అయ్యారు. తుని నియోజకవర్గంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతోంది. ముందు పవన్‌తో అనిపించి తర్వాత చంద్రబాబు పొత్తులపై రాగం అందుకున్నాడు.

గతంలో టీడీపీతో పొత్తు ఉండదని చెప్పి పవన్‌ మర్చిపోయాడేమో..?. ఇప్పుడు చంద్రబాబు పిలుపు కోసం చూస్తున్నా అంటున్న పవన్‌కి సిగ్గుందా?. రాజకీయాల్లో పవన్‌కి సిద్ధాంతం అంటూ లేదు. పవన్‌, చంద్రబాబు కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఇన్ని రాజకీయ పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడే ఏకైక పార్టీ జనసేన. మీరు ఎంతమంది కలిసినా జగన్‌ సింగిల్‌గానే ఉంటారు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారు' అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

చదవండి: (అసాని తుపాన్‌ ఎఫెక్ట్‌.. ఒక్కసారిగా మారిన వాతావరణం​)

మరిన్ని వార్తలు