ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా: గంగుల

19 Jul, 2021 18:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనపై హత్యకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన సంచలన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సానుభూతి కోసమే ఈటల చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది దిగజారుడు రాజకీయమని చెప్పారు. బీజేపీలో ఉన్న ఈటల హత్య కుట్రపై సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించుకోవచ్చు అని హితవు పలికారు.

ఈ విషయంపై తొందరగా తేల్చాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రంతో చెప్పి ఈటల ఆరోపణలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఈటల రాజేందర్‌కు ఏమీ కాదని ఆయన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు