నారాయణ స్కూల్ ర్యాంకుల్లా లోకేష్‌ ప్రచారం

7 Sep, 2020 15:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గౌతమ్‌ రెడ్డి తప్పుబట్టారు. గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్‌ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తననానికి నిదర్శమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్వీట్‌లు దిగజారి ఉన్నాయని, 10వ తరగతి ఫలితాల రోజు నారాయణ స్కూల్ ర్యాంకులు ప్రచార చేసినట్టు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలిన హితవుపలికారు. అబద్ధాలతో లోకేష్‌ భవిష్యత్‌కే నష్టమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ అనేది ఎంఎస్‌ఈలకు ఉపయోగపడుతుందని, 2019 ఆగస్ట్‌లో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల డేటా పంపినట్లు వివరించారు. (సీఎం జగన్‌ సంకల్పం.. ఏపీ నెంబర్ ‌వన్‌)

సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. ‘గతంలో ర్యాంక్‌కు, ఇప్పుడొచ్చిన ర్యాంక్‌కు చాలా తేడా ఉంది. మొట్టమొదటి సారి సర్వే చేసి ఫలితాలు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారితోనే సర్వే చేశారు. అది కూడా కేవలం 10శాతం మాత్రమే సర్వే చేశారు. 32లక్షల కోట్ల ఎంవోయూలు అన్నారు. 50వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ప్రభుత్వం 20 ఏళ్లూ పెనాల్టీ కట్టే రీతిలో రాయితీలు పెట్టారు. మా వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?. సీఎం జగన్ పారదర్శక పాలన వల్ల ఇది సాధ్యమైంది. సీఎం జగన్ విధానాలపై పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారు’  గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. (జగన్‌ పాలనపై 100% సంతృప్తి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు