‘మేము ఏదన్నా అంటే బయటకెళ్లి ఏడుస్తారు’

23 Jun, 2022 20:10 IST|Sakshi

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, అమరావతి: రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పారిశ్రామిక రంగానికి సైతం పెద్దపీట వేస్తున్నామన్నారు. పరిశ్రమలకు కావాల్సిన ఇన్‌ఫ్రా స్టక్చర్‌ను ప్రభుత్వం అందిస్తోందన్నారు.  కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు. ‘‘చంద్రబాబు హయాంలో ఏపీలో ఎటువంటి అభివృద్ధి లేదని.. సీఎం జగన్‌ ప్రభుత్వంలో ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: ఆత్మకూరు పోలింగ్‌: బయటపడ్డ టీడీపీ బండారం

‘‘ఎన్టీఆర్‌ వారసుడని చెప్పుకునే అర్హత లోకేష్‌కు లేదు. మేము ఏదన్నా అంటే బయటకు వెళ్లి ఏడుస్తారు. దావోస్‌ పర్యటనపై చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదు. మేము ప్రజలకు చేయాలనుకున్నది చేస్తున్నాం. అధికారం కోసం సొంత భార్యనే చంద్రబాబు రోడ్డు మీద నిలబెట్టారు. అంతకంటే ఆయన గురించి ఏమి చెప్పగలం. చంద్రబాబు, లోకేష్‌ బ్రాంతుల్లోనే బతుకుతారు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీయాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయంటూ’’ మంత్రి మండిపడ్డారు.

మూడేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రెండేళ్లు కోవిడ్‌తో పోరాటం చేసినా పరిశ్రమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఏపీలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం మనకు మంచి అవకాశాలు ఇస్తోంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారు. దావోస్‌లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం, అవకాశాలు వివరించామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు