మూడు రాజధానులపై మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

9 Sep, 2022 12:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు.
చదవండి: ‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’

‘‘చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోసం చేశారు. 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. కొంతమంది పాదయాత్ర అంటున్నారు. అది విశాఖపై దండయాత్ర. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరు. పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబే కారణం. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరు’’  అని మంత్రి అన్నారు. ‘‘మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చు’’ అని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు