కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి గుడివాడ అమరనాథ్‌

29 Apr, 2022 19:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, జరిగిన అభివృద్ధిని పరిశీలించేందుకు  నాలుగు బస్సులు కాదు, నాలుగు వందల బస్సులతో ఏపీకి రావాలని మంత్రి గుడివాడ అమరనాథ్‌ కేటీఆర్‌ను ఆహ్వానించారు. 

చదవండి👉 (కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి)

ఈ మేరకు మంత్రి గుడివాడ అమరనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఒక నగరాన్ని చూసి రాష్ట్రం అంతా బాగుందని అనుకోవడం పొరపాటు. భాగ్యనగరం అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉంది. లక్షన్నర కోట్లు నేరుగా ప్రజలకు అందించిన ఘనత మాది. 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, ఇది ప్రపంచ రికార్డు. ఏపీలో గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు చూడండి. గ్రామసచివాలయాలు సందర్శించండి. 16 రాష్ట్రాలలో పవర్ కట్ ఉంది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే దీన్ని అధిగమిస్తాం.

చదవండి👉 (కేటీఆర్‌ వ్యాఖ్యలపై సజ్జల స్ట్రాంగ్‌ కౌంటర్‌)

తెలంగాణలో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఐటీ పరంగా హైదరాబాద్‌కు అడ్వాంటేజ్ ఉంది. ఏపీలోనూ తీరప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఏపీని పారిశ్రామికంగానూ అభివృద్ధి చేస్తాం. త్వరలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తాం' అని మంత్రి గుడివాడ అమరనాథ్‌ తెలిపారు.

చదవండి👉 (కేటీఆర్‌కు మంత్రి అప్పలరాజు సవాల్‌.. ‘40 బస్సులు వేసుకొని రండి’)

మరిన్ని వార్తలు