‘స్కిల్డ్‌ క్రిమినల్‌ ఫస్ట్‌ టైమ్‌ చట్టానికి దొరికిపోయాడు’

10 Sep, 2023 20:47 IST|Sakshi

పెద్ద మనిషిగా చలామణి అవుతూ చంద్రబాబు అనేక అక్రమాలు

చంద్రబాబు ఒక స్కిల్డ్‌ క్రిమినల్‌

బాబు అభినవ వీరప్పన్‌

ఇన్నాళ్లకు చేసిన పాపాలు పండాయి

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధ్వజం

సాక్షి, తాడేపల్లి : ప్రజల్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ అనేక అక్రమాలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. చంద్రబాబు ఒక స్కిల్డ్‌ క్రిమినల్‌. అలాంటి దొంగ ఫస్ట్‌ టైమ్‌ చట్టానికి దొరికిపోయాడు. కోర్టు బోనెక్కాడు.. కటకటాల వెనక్కి వెళ్లాడు. చంద్రబాబు అభివన వీరప్పన్‌. పెద్ద మనిషిగా చలామణి అవుతూ అనేక అక్రమాలు చేశారు చంద్రబాబు. ఆయన చేసిన పాపాలు పండాయి.

ఇన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు, అక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎంతపెద్ద లాయర్లను తెచ్చినా చేసిన తప్పులకు శిక్ష తప్పలేదు.  నేను తప్పు చేయలేదు అనే మాట ఇంతవరకు చంద్రబాబు చెప్పలేదు. ఎంతసేపు టెక్నికల్ పాయింట్స్ మాట్లాడటమే తప్ప చేసిన తప్పుడు పనుల గురించి మాట్లాడలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కర్త, కర్మ, క్రియ, సూత్రధారి చంద్రబాబే. నలభై ఏళ్లుగా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు దొరికిపోయారు.దత్తపుత్రుడు ఒక పక్క నడక, ఇంకో పక్కన పడక సీన్లతో వేషాలేస్తున్నారు. ఆయనకు కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు’ అని ధ్వజమెత్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

చదవండి: Babu @ Jail : బెయిల్ కాదు చంద్రబాబుకు జైలే

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమే

మరిన్ని వార్తలు