అయ్యన్న.. వాస్తవాలు తెలుసుకో..

6 Oct, 2020 19:05 IST|Sakshi

మంత్రి గుమ్మనూరు జయరాం

సాక్షి, కర్నూలు: పదవిని కోల్పోయిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.(చదవండి: డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు: జయరాం)

‘‘15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమి కొనుగోలు చేశారు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములిద్దరికి విభేదాలు వచ్చాయి. నేను అన్నీ చెక్ చేయించి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశా. ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. దీంట్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఈ అంశంపై ఆస్పిరి పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు కూడా పెట్టానని’’ ఆయన వివరించారు. ఒక రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా.. మరి 2 ఎకరాల చంద్రబాబు ఇప్పుడు ఇలా ఎలా ఎదిగాడో అయ్యన్నపాత్రుడు అడగాలి. ఒక బీసీ మంత్రిని అణగదొక్కాలని చూస్తున్నారు. ఆ రోజు 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తా అని చంద్రబాబు నాకు ఎర వేసాడు. అచ్చెన్నాయుడిలా అవినీతికి పాల్పడలేదని జయరామ్‌ అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొన్ని డిస్పెన్సరీలను తనిఖీ చేశానని, వాటిలో మెడిసిన్స్ లేవని తేలింది. బాకీలు మాత్రం కట్టాల్సి వచ్చింది. దీంతో విచారణకు అదేశించా. వాస్తవాలు బయటకు వచ్చాయని ఆయన తెలిపారు. (చదవండి: ఏపీ: చెరకు రైతులతో మంత్రుల కమిటీ భేటీ)

మరిన్ని వార్తలు