-

రిస్క్‌ వద్దు.. కారు ముద్దు

26 Nov, 2023 05:26 IST|Sakshi

కేసీఆర్‌ చేతిలోనే తెలంగాణ సేఫ్‌ 

కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలే 

రైతులను బిచ్చగాండ్లు అన్న రేవంత్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి 

యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో రోడ్‌షోలు, 

కార్నర్‌ మీటింగ్‌లలో మంత్రి హరీశ్‌

సాక్షి, యాదాద్రి, సాక్షిప్రతినిధి, వరంగల్‌/సాక్షి మహబూబాబాద్‌ /నెక్కొండ/బచ్చన్నపేట: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రిస్‌్కలో పడుతామని, సీఎం కేసీఆర్‌ చేతిలోనే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని మంత్రి తన్నీరు హరీ‹Ùరావు వ్యాఖ్యానించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం చీకటిమామిడిలో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు.

80 సీట్లు గెలిచి బీఆర్‌ఎస్‌ మూడో సారి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పా రు. యాసంగిలో రైతు బంధు అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వగానే కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్‌ అన్నారు. బ్యాంకులకు సెలవులు పూర్తికాగానే మంగళవారం రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుందని చెప్పా రు.

కాంగ్రెస్‌కు చాన్స్‌ ఇస్తే ఆరు గ్యారంటీలకు బదులు, వాళ్లకు వాళ్లు తన్నుకుని ఆరుగురు ముఖ్యమంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. ఎన్నో మంచి పనులు చేసిన కేసీఆర్‌ను సాదుకుందామా, రాజకీయంగా సంపుకుందామో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భువనగిరి, ఆలేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా పాల్గొన్నారు. 

కర్ణాటకలో కరెంటు బంద్‌ అయింది. 
ఆరు గ్యారంటీలని కాంగ్రెస్‌ నేతలు ఊర్లపొంటి తిరుగుతున్నారు.. ఆరునెలల క్రితం కర్ణాటకకు పోయి ఐదు గ్యారంటీలిస్తామని అక్కడ రాహుల్‌ గాం«దీ, ప్రియాంకగాంధీ చెప్పారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న కరెంట్‌ బందయ్యింది. ఐదు గ్యారంటీలను గాలికొదిలేసింది... హామీలిచ్చిన ప్రియాంక, రాహుల్‌లు ఆ రాష్ట్రానికి వెళ్లడం లేదు. అలాంటివాళ్లు తెలంగాణలో అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటే నమ్మాలా? 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్‌ కావాలా లేక మాట తప్పే కాంగ్రెస్‌ కావాలో ఆలోచించుకోవాలి’అని హరీశ్‌రావు అన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, నెక్కొండ, పాలకుర్తి, బచ్చన్నపేటలలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. పాలిచ్చే గేదెవంటి బీఆర్‌ఎస్‌ పారీ్టకి కాకుండా పనిచేయని దున్నపోతు వంటి కాంగ్రెస్‌కు గడ్డి వేస్తే ఫలితం ఉండదు’అని అన్నారు. 

ప్రాజెక్టులు రేవంత్‌ నెత్తిపై కట్టాలా 
 మూడు గంటల కరెంట్‌ చాలని చెప్పిన రేవంత్‌ ఇప్పుడు ప్రాజెక్టులు ఇసుకపై కట్టారని అనడం అయన అవగాహనా రాహిత్యానికి నిదర్శమని హరీశ్‌ ధ్వజమెత్తారు. నదులపై ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇసుకపై కాకుండా రేవంత్‌ నెత్తిపై కట్టాలా అని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం రైతుబంధు అందిస్తుంటే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు బిచ్చం వేస్తుందని, రైతులను బిచ్చగాళ్లుగా మాట్లాడిన రేవంత్‌కు, కాంగ్రెస్‌ పారీ్టకి ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని పిలుపు నిచ్చారు.

సోమవారం నుంచి రైతు ఖాతాల్లో డబ్బులు పడతాయని హరీశ్‌ చెప్పారు. డబ్బులు పడిన మెస్సేజీ శబ్దం టింగ్‌. టింగ్‌ మంటూ వస్తుందన్నారు. ఆ శబ్ధం విన్న రైతులు ఆదే ఊపుతో 30వ తేదీ పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనుమతి ఇస్తే రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు.

ఒకే రోజు.. ఆరు జిల్లాలు.. ఏడు సభలు 
హరీశ్‌రావు శనివారం ఒక్కరోజు ఆరు జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ఒక్కరోజే మహబూబాబాద్, వరంగల్, పాలకుర్తి, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో హెలికాప్టర్‌ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం హెలికాప్టర్‌లోనే చేశారు. 

మరిన్ని వార్తలు