కిషన్‌ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది: మంత్రి హరీష్‌రావు

12 Nov, 2021 13:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: వరిధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు తలోమాట మాట్లడుతున్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా సిద్ధిపేటలో.. టీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..  కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి స్థలమే కాదు.. బిల్డింగ్‌ కూడా ఇచ్చామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కిషన్‌ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హరీష్‌రావు  హితవు పలికారు. కేం‍ద్రం.. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇ‍వ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై కిషన్‌రెడ్డికి ప్రేమ ఉంటే.. ప్రత్యేక నిధులు తేవాలని మం‍త్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.  

చదవండి: దంపతుల మధ్య గొడవ.. భర్త ఫోన్‌ స్వీచ్చాఫ్‌..

మరిన్ని వార్తలు