గవర్నర్ తమిళిసైకు మంత్రి హరీష్‌ కౌంటర్‌.. బీబీనగర్‌ వెళ్లండి అంటూ చురకలు!

9 Sep, 2022 15:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. కొద్దిరోజులుగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళిసై తెలంగాణలో వైద్య వ్యవస్థపై కూడా కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి హరీష్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థపై గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరం. కేసీఆర్‌ నాయకత్వంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. కేంద్రం పరిధిలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి.. కనీస వసతులు కూడా లేవు అని కౌంటర్‌ ఇచ్చారు. 

కాగా, అంతకుముందు గవర్నర్‌ తమిళిసై.. నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్ గుండెపోటుకు గురవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్‌ డైరెక్టర్‌ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు