‘హైదరాబాద్‌ వెళ్లి ఆ ఘటనతో సంబంధం లేదని చెప్తావా?’

2 Jan, 2023 18:46 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తొక్కిసలాటలో గాయపడిన వారిని మంత్రి జోగి రమేష్‌ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రాంతి కానుక పేరుతో పేదలను బలి తీసుకున్నారని, వారి ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని దుయ్యబట్టారు. ‘‘కందుకూరు సభ తర్వాత కూడా చంద్రబాబుకు పశ్చాత్తాపం లేదు. హైదరాబాద్‌ వెళ్లి ఆ ఘటనతో నాకు సంబంధం లేదని చెప్తావా? నమ్మించి మోసం చేయడం చంద్రబాబు రక్తంలోనే ఉంది. చంద్రబాబును నమ్మినవారు నట్టేట మునిగినట్టే’’ అని మంత్రి అన్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: కన్నబాబు
కాకినాడ జిల్లా:
చంద్రబాబుకు తన రాజకీయాలు తప్పా.. ప్రజల ప్రాణాలు పట్టవని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత సంఘటన జరిగితే.. దానికి చంద్రబాబుకు బాధ్యత లేదా?. అని కన్నబాబు ప్రశ్నించారు. పుష్కరాల్లో చంద్రబాబు కుటుంబం స్నానాలకు 29 మంది చనిపోయారు. కనీసం వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించ లేదు. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కన్నబాబు హితవు పలికారు.
చదవండి: డేంజర్‌ గేమ్‌.. చంద్రబాబు ప్లాన్‌ అదే..? ఇదిగో రుజువులు..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు