‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’

21 Feb, 2024 18:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు.

భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్‌కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్‌ చెప్పారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్‌.. కుప్పం బరిలో భువనేశ్వరి?
 

whatsapp channel

మరిన్ని వార్తలు